కమల్, కీర్తి సురేష్ లకు అవార్డులు

కమల్, కీర్తి సురేష్ లకు అవార్డులు

Published on May 26, 2024 8:39 PM IST

‘ఒసాకా తమిళ్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌’ విజేతల జాబితాను తాజాగా ప్రకటించడం జరిగింది. 2022లో విడుదలై, మెప్పించిన సినిమాలకు సంబంధించిన వివరాలను ఆదివారం ఆ సంస్థ ప్రకటించింది. ‘విక్రమ్‌’ ఉత్తమ చిత్రంగా నిలిచింది. విక్రమ్ సినిమాలో ప్రధాన పాత్ర పోషించిన కమల్‌ హాసన్‌ కి ఉత్తమ నటుడిగా అవార్డు దక్కింది.

అలాగే, ‘సాని కాయితం’ చిత్రానికి గానూ కీర్తి సురేశ్‌ ఉత్తమ నటిగా అవార్డు వచ్చింది. ఇక ఉత్తమ దర్శకుడి పురస్కారానికి వస్తే.. దర్శకుడు మణిరత్నంకి దక్కింది. ఆయన తీసిన పొన్నియిన్‌ సెల్వన్‌ 1 చిత్రానికి ఈ అవార్డు దక్కింది. ఇక ఉత్తమ సంగీత దర్శకుడి పురస్కారానికి అనిరుధ్‌ ఎంపిక అయ్యారు. విక్రమ్‌ సినిమాకి అనిరుధ్‌ ఈ అవార్డును అందుకున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు