బన్నీ, నితిన్ ల సినిమాలతోనే అక్కడ మొదలు..!

Published on Oct 15, 2020 7:04 am IST

ఈ 2020 ఏడాది అనే మ్యాజిక్ ఫిగర్ నెంబర్ లో ఉన్న మ్యాజిక్ సంవత్సరం పొడవునా ఉంటుంది అని అంతా అనుకున్నారు కానీ ఈ రేంజ్ లో ఊహించని విధంగా నిలిచిపోతుంది అని ఎవరూ ఊహించలేదు. అయితే ఈ ఏడాది ఆరంభంలో మాత్రం మన టాలీవుడ్ హీరోలకు మరియు పరిశ్రమకు శుభారంభమే అందుకుంది అని చెప్పాలి.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ “అల వైకుంఠపురములో” తో యూత్ స్టార్ నితిన్ “భీష్మ” చిత్రాలతో సాలిడ్ కం బ్యాక్ హిట్స్ కొట్టారు. ఇప్పుడు ఇదే హీరోల సినిమాలను థియేటర్స్ రీ ఓపెన్ చేస్తున్న సందర్భంగా బెంగళూరు మల్టీప్లెక్స్ లు మరియు పలు ఇతర థియేటర్స్ లో ఈ చిత్రాల స్పెషల్ స్క్రీనింగ్స్ తోనే ఈరోజు తెరుచుకొనున్నాయట. అయితే ఇదిలా ఉండగా మన తెలుగు రాష్ట్రాల్లో అయితే థియేటర్లు ఇప్పుడప్పుడే తెరుచునే పరిస్థితులు కనిపించలేదు.

సంబంధిత సమాచారం :