విడుదల తేదీ : ఫిబ్రవరి 06, 2026
123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5
నటీనటులు : అభిషన్ జీవింత్, అనశ్వర రాజన్, హరీష కుమార్, కావ్య అనిల్, సచిన్ నాచిప్పన్, తేనీ మురుగన్, శరవణన్ తదితరులు.
దర్శకుడు : మదన్
నిర్మాతలు: సౌందర్య రజనీకాంత్, మగేష్ రాజ్ పసిలియాన్
సంగీతం : సీన్ రోల్డన్
ఛాయాగ్రహణం : శ్రేయాస్ కృష్ణ
కూర్పు : సురేష్ కుమార్
సంబంధిత లింక్స్ : ట్రైలర్
అభిషాన్ జీవింత్, అనశ్వర రాజన్ హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా విత్ లవ్. ఈ సినిమాకు మదన్ దర్శకత్వం వహించారు. కాగా ఈ సినిమా ఈ రోజు విడుదల అయింది. మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !
కథ :
సత్య (అభిషన్ జీవింత్) కొంచెం సిగ్గరి. తన పెళ్లి చూపుల కోసం మోనీషా (అనశ్వర రాజన్)ని కలుస్తాడు. అలా వీరిద్దరూ పెళ్లి చూపుల కోసం కలుస్తారు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య జరిగిన డిస్కషన్ లో తమ జీవితంలో జరిగిన ప్రేమ గురించి మాట్లాడుకుంటారు. తన స్కూల్ లైఫ్ లో సత్య అనీషా అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. కానీ, ఆ విషయాన్ని ఆమెకు చెప్పలేకపోతాడు. అలాగే, మోనీషా (అనశ్వర రాజన్) కూడా తన స్కూల్ లైఫ్ లో ఓ అబ్బాయితో ప్రేమలో పడుతుంది. కానీ, ఆ విషయాన్ని అతనికి చెప్పలేకపోతుంది. మరి వీరిద్దరూ మొదలు పెట్టిన మిషన్ ఏమిటి ?, చెప్పలేక పోయినా తమ ప్రేమ కోసం వీరిద్దరూ ఏం చేశారు ?, చివరకు ఈ కథ ఎలాంటి మలుపు తిరిగింది ?, ఇంతకీ, సత్య – మోనీషా కలిశారా ? లేదా ? అనేది మిగిలిన కథ.
ప్లస్ పాయింట్స్ :
ప్రాణంగా ప్రేమించి, ఆ ప్రేమించిన వ్యక్తికి ఆ ప్రేమ గురించి చెప్పలేకపోతే.. ఆ చెప్పలేని వన్ సైడ్ లవ్ లో నుంచి పుట్టే బావోద్వేగం, ఆ పరిస్థితి ఎలా ఉంటుంది ?, ఆ ప్రేమ గురించి చెప్పడానికి చేసిన ప్రయత్నం.. ఈ మధ్యలో సినిమా మేకింగ్ డ్రామాతో పాటు ఫాదర్ సెంటిమెంట్, హీరో – హీరోయిన్ల మధ్య ఎమోషన్స్ మరియు కొన్ని కామెడీ సీన్స్ అండ్ డైలాగ్స్.. ఇవ్వన్నీ ఈ ‘విత్ లవ్’ సినిమాకి బాగా ప్లస్ అయ్యాయి. మొత్తానికి సినిమాలో వినోదంతో పాటు కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ కూడా ఆకట్టుకున్నాయి.
ఈ సినిమాలో హీరోగా నటించిన అభిషన్ జీవింత్ తన నటనతో, తన బాడీ లాంగ్వేజ్ తో మరియు ఎమోషనల్ అండ్ కామెడీ సీక్వెన్స్ స్ లో చాలా బాగా నటించాడు. అలాగే క్లిష్టమైన కొన్ని కీలక సన్నివేశాల్లో కూడా అభిషన్ జీవింత్ నటన బాగుంది. సినిమాలో కీలకమైన పాత్రలో నటించిన హీరోయిన్ అనశ్వర రాజన్ కూడా తన పాత్రకి పూర్తి న్యాయం చేసింది. మరో ప్రధాన పాత్రలో హరీష్ కుమార్ కూడా చాలా బాగా నటించాడు. సచిన్ నాచిప్పన్ ఆకట్టుకున్నాడు. తేనీ మురుగన్, శరవణన్ లతో సహా ఇతర పాత్రల్లో కనిపించిన మిగిలిన నటీనటులు కూడా తమ పరిధి మేరకు బాగా నటించారు.
మైనస్ పాయింట్స్ :
ఈ విత్ లవ్ గురు సినిమా చూసినంత సేపు సరదాగా సాగినా, అలాగే కథలో కొన్ని ఎమోషన్స్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచినా, కొన్ని సన్నివేశాలు మాత్రం రెగ్యులర్ గానే సాగాయి.
ముఖ్యంగా హీరోహీరోయిన్ల మధ్య ప్రేమకు సంబంధించిన ట్రాక్ కు ఇంకా బలంగా ఉంటే బాగుండేది. అదే విధంగా లవ్ సీన్స్ ఇంకా ఎంటర్ టైన్ గా ఉండి ఉంటే బాగుండేది. ఇక సెకండ్ హాఫ్ లో చాలా సన్నివేశాలు చాలా స్లోగా సాగాయి.
మొత్తానికి ఈ లవ్ అండ్ ఫన్ డ్రామాలో కొన్ని కామెడీ సీన్స్, కొన్ని లవ్ ఎలిమెంట్స్ బాగున్నా.. మిగిలిన సీన్స్అత్త. సింపుల్ ప్లేతో సాగాయి.
సాంకేతిక విభాగం :
ఇక సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడుకుంటే.. దర్శకుడు మదన్ దర్శకుడిగా.. రచయితగా ఆకట్టుకున్నాడు. ఆయన రాసుకున్న స్క్రీన్ ప్లే ఇంట్రెస్ట్ గా సాగింది. కాకపోతే, సంగీత దర్శకుడు సీన్ రోల్డన్ అందించిన సంగీతం బాగుంది. కెమెరామెన్ విజువల్స్ ను చాలా సహజంగా అలాగే చాలా అందంగా చూపించారు. ఫైనల్ గా నిర్మాణ విలువలు కూడా చాలా బాగున్నాయి.
తీర్పు :
‘విత్ లవ్’ అంటూ వచ్చిన ఈ చిత్రంలో మెయిన్ కాన్సెప్ట్, కామెడీ సీన్స్ అండ్ లవ్ సీన్స్ మరియు నటీనటులు నటన బాగున్నాయి. అలాగే, కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ కూడా ఆకట్టుకున్నాయి. ఐతే, సింపుల్ గా సాగే స్క్రీన్ ప్లే వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. ఓవరాల్ గా ఈ చిత్రం లవ్ అండ్ ఫన్ ఎలిమెంట్స్ తో ఆకట్టుకుంది.
123telugu.com Rating: 3/5
Reviewed by 123telugu Team


