నాచురల్ స్టార్ నాని హీరోయిన్ గా యంగ్ హీరోయిన్ కయాదు లోహర్ హీరోయిన్ గా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఓ యజ్ఞంలా చేస్తున్న అవైటెడ్ సినిమానే ది ప్యారడైజ్. భారీ హైప్ సంతరించుకున్న ఈ సినిమా విడుదల ఇప్పుడు దగ్గరకి వచ్చేస్తుంది. అయితే ఎలాంటి డౌట్స్ లేవు ఆన్ టైం సినిమా వస్తున్నట్టు మేకర్స్ ప్రామిస్ చేసారు.
ఇక ఈ గ్యాప్ లో సినిమా మొత్తం షూట్ పూర్తి కావడానికి కేవలం ఒకే ఒక్క సాంగ్ చేయాల్సి ఉందట. నాని, కయాదు కాంబినేషన్లో ఈ ఒక్క సాంగ్ పూర్తి చేస్తే ప్యారడైజ్ షూటింగ్ అంతా పూర్తి చేసేసినట్టే అట. ఈ సాంగ్ ని ఈ కొన్ని రోజుల్లోనే కంప్లీట్ చేయనున్నారట. సో ఇక పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా అయిపోతే ఆన్ టైం ప్యారడైజ్ వచ్చేస్తుంది. ఇక ఈ సినిమాకి అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే ఎస్ ఎల్ వి సినిమాస్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మాణం వహిస్తున్నారు.


