షాకింగ్ : “పుష్ప” ప్రేరణతో భారీ ధర చేసే సరుకుతో దొరికిపోయిన స్మగ్లర్.!

Published on Feb 3, 2022 12:38 pm IST


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా “పుష్ప” కలిగించిన ఇంపాక్ట్ ఇంకా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మన టాలీవుడ్ మోస్ట్ ఇంటెలిజెంట్ దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా కంప్లీట్ కొన్ని ఎలిమెంట్స్ పక్కన పెడితే పుష్ప రాజ్ గా అల్లు అర్జున్ ని ప్రెజెంట్ చేసిన తీరు అయితే ఓ రేంజ్ లో పాన్ ఇండియన్ వైడ్ ప్రేక్షకులని ఇంప్రెస్ చేసింది.

మరి ఒక స్మగ్లర్ గా పుష్ప ఈ సినిమాలో చేసే ప్లానింగ్ లు గాని ఆ ఎర్ర చందనం దుంగలు సప్లై కానీ సినిమాలో ఆకట్టుకునే విధంగా అనిపిస్తాయి. మరి ఈ ప్లానింగ్ నే ఓ నిజమైన స్మగ్లర్ నిజ జీవితంలో పుష్ప సినిమా ప్రేరణగా తీసుకొని ప్లాన్ చేసాడట. ఇక అసలు వివరాల్లోకి వెళితే..

పుష్ప సినిమా చూసి ఇన్స్పైర్ అయ్యిన యాసీన్ ఇనాయతుల్లా అనే స్మగ్లర్ ఒక ట్రక్ లో ఏకంగా 2.45 కోట్ల విలువ చేసే ఎర్ర చందనం దుంగలని కూరగాయల బాక్స్ లతో కప్పేసి తీసుకెళ్లే ప్రయత్నం చేసాడు కానీ లాస్ట్ కి మహారాష్ట్ర పోలీస్ దగ్గర దొరికేసాడు. దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు బయటకి రాగా అతడు పుష్ప సినిమా చూసి ఇలా ప్లాన్ చేసుకున్నాడని పోలీసులు తెలిపినట్టు తెలిసింది. దీనితో ఈ వార్త ఇప్పుడు ఆసక్తిగా మారింది.

సంబంధిత సమాచారం :