“RRR” వాయిదాతో విపరీతమైన ఎమోషన్ లో తారక్, చరణ్ ఫ్యాన్స్.!

“RRR” వాయిదాతో విపరీతమైన ఎమోషన్ లో తారక్, చరణ్ ఫ్యాన్స్.!

Published on Jan 2, 2022 2:00 PM IST

ఈ ఏడాది ఎన్నో అంచనాలు నడుమ రిలీజ్ కావాల్సి ఉన్న భారీ పాన్ ఇండియన్ చిత్రం “రౌద్రం రణం రుధిరం”. మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియన్ సినిమాగా ఇది ఈ ఏడాది ఆరంభాన్ని అందిస్తుంది అనుకుంటే అనుకోని అననుకూల పరిస్థితులు రీత్యా మళ్ళీ వాయిదా పడింది. జస్ట్ ఇంకొన్ని రోజుల్లోనే ఈ సినిమా థియేటర్స్ లోకి వచ్చేస్తుంది అనగా ఈ ఊహించని షాక్ ప్రతి ఒక్కరినీ స్తంభింపజేసింది.

ఇక ముఖ్యంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు అయితే ఇప్పుడు చాలా ఎమోషనల్ అవుతున్నారు. ఆల్రెడీ అనేక ప్రాంతాల్లో సినిమా రిలీజ్ కి సంబంధించి ఫ్లెక్స్ లు కటౌట్ లు ఇలా అన్నీ సిద్ధం చేసుకుంటున్నారు.

వారి పరిస్థితి, ఈ పనులు అన్ని ఇప్పుడు ఆగిపోవడం వారిని మరింత కలచివేసింది. మొత్తానికి మాత్రం వాళ్ళు మాత్రం చెయ్యగలిగింది ఏముంది? పరిస్థితులు బాగాలేవని సర్ది చెప్పుకుంటున్నారు. అయినా మేకర్స్ కి ఉండే బాధ కూడా వారికన్నా రెట్టింపు బాధ పడుతూ ఉండొచ్చు. మరి మళ్ళీ ఈ భారీ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు