టాలీవుడ్ లో ఫ్యాషన్ తో సినిమాలు చేసే నిర్మాతలలో వారాహి చలన చిత్రం బ్యానర్ అధినేత సాయి కొర్రపాటి ఒకరు. మొదటి నుంచి సినిమా సినిమాకి సంబంధం లేకుండా అటు కమర్షియల్, ఇటు ప్రయోగాత్మక మరియు లో బడ్జెట్ సినిమాలు తీస్తూ కొత్తవారికి అవకాశాలను కల్పిస్తున్నారు. అలా ఆయన బ్యానర్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న హీరో నాగ శౌర్య.
సాయి కొర్రపాటి నాగ శౌర్యతో చేసిన ‘ఊహలు గుసగుసలాడే’ సినిమా మంచి విజయాన్ని అందుకొని అతని హీరోగా గుర్తింపు తెచ్చింది. ఇప్పుడు అదే బ్యానర్ లో నాగ శౌర్య హీరోగా వస్తున్న సినిమా ‘దిక్కులు చూడకు రామయ్య’. సాయి కొర్రపాటి లేకపోతే నాగ శౌర్య అనే అతను లేడని శోర్య అంటున్నాడు.. ‘ఎంతో ఫ్యాషన్ ఉన్న నిర్మాత సాయి కొర్రపాటి. సాయి కొర్రపాటి గారు మీరు లేకపోతే ఇండస్ట్రీలో నేను అనే వాడిని ఉండేవాడిని కాదని’ నాగ శౌర్య తన ఫేస్ బుక్ ద్వారా చెప్పాడు.
నాగ శౌర్య, సన, అజయ్, ఇంద్రజ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా అక్టోబర్ 10న ప్రేక్షకులకు ముందుకు రానుంది. త్రికోటి దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాకి ఎంఎం కీరవాణి సంగీతం అందించాడు.


