“ఎఫ్ 3” నుండి ‘వూ ఆ..’ సాంగ్ మేకింగ్ వీడియో రిలీజ్!

Published on Apr 26, 2022 5:34 pm IST

విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా మెహ్రిన్, తమన్నా భాటియా లు హీరోయిన్స్ గా అనిల్ రావిపూడి దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఔట్ అండ్ ఔట్ ఎంటర్ టైనర్ ఎఫ్ 3. ఎఫ్ 2 కి కొనసాగింపు గా వస్తున్న ఈ చిత్రం లో సోనాల్ చౌహాన్, సునీల్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం నుండి వూ ఆ అనే సిసలైన మస్తి సాంగ్ ను చిత్ర యూనిట్ విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ పాటకు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఇదే పాటకు సంబందించిన మేకింగ్ వీడియో ను చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేయడం జరిగింది.

57 సెకన్ల పాటు నిడివి ఉన్న ఈ మేకింగ్ విడియో ఆకట్టుకుంటుంది. మే 27, 2022 న భారీగా థియేటర్ల లో విడుదల కాబోతున్న ఈ చిత్రం కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :