విజయ్ దేవరకొండ కి ‘వరల్డ్ ఫేమస్ లవర్’ డిస్ట్రిబ్యూటర్స్ షాకింగ్ ట్వీట్

Published on Sep 6, 2023 12:40 am IST

యువ నటుడు విజయ్ దేవరకొండ తాజాగా సమంత తో కలిసి నటించిన మూవీ ఖుషి. శివ నిర్వాణ తెరకెక్కించిన ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించారు. ఇక ఈమూవీ ఆడియన్స్ యొక్క మెప్పుతో మంచి సక్సెస్ తో ప్రస్తుతం థియేటర్స్ లో కొనసాగుతోంది. ఇక తమ మూవీకి ఇంత పెద్ద విజయం అందించిన ఫ్యాన్స్, ఆడియన్స్ కోసం రూ. 1 కోటి రూపాయలని షేర్ చేస్తానని, అందుకోసం ఒక 100 మంది కుటుంబాలను ఎంపిక చేసి వారి ఒక్కొక్కరికి రూ. 1 లక్ష చొప్పున అందిస్తానని నిన్న తెలిపిన విజయ్ దేవరకొండ తాజాగా దానికి సంబంధించి ఒక ఫార్మ్ ని ఫిలప్ చేయమని కోరుతూ తన సోషల్ మీడియా ప్రొఫైల్స్ లో పోస్ట్ చేసారు.

అయితే విజయ్ కి షాక్ ఇస్తూ ఆయన గతంలో నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ అయిన అభిషేక్ పిక్చర్స్ వారు తమ సోషల్ మీడియా ప్రొఫైల్స్ లో ఒక ట్వీట్ చేసారు. మీరు నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ మూవీ వలన మేము రూ. 8 కోట్లు నష్టపోయాము, దానిపై ఇప్పటివరకు ఎవరూ కూడా స్పందించలేదు. ఇప్పుడు మీరు రూ. 1 కోటిని మంచి మనసుతో పలు కుటుంబాలకు అందిస్తాను అంటున్నారు. అయితే దయచేసి మమ్మల్ని మరియు మా ఎగ్జిబిటర్స్ & డిస్ట్రిబ్యూటర్స్ కుటుంబాలను కూడా రక్షించాలని అభ్యర్థిస్తున్నాము మరియు ఆశిస్తున్నాము అంటూ వారు పోస్ట్ చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి దీని పై విజయ్ ఏవిధముగా స్పందిస్తారో చూడాలి. కాగా 2020 ఫిబ్రవరి 14న విడుదలైన వరల్డ్ ఫేమస్ లవర్ మూవీ పెద్ద ఫెయిల్యూర్ గా నిలిచింది.

సంబంధిత సమాచారం :