వరల్డ్ వైడ్ ‘పెద్ది’ డే 1 వసూళ్ల ప్రిడిక్షన్.!

వరల్డ్ వైడ్ ‘పెద్ది’ డే 1 వసూళ్ల ప్రిడిక్షన్.!

Published on Jun 4, 2026 8:02 AM IST

Peddi

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ అవైటెడ్ సినిమానే ‘పెద్ది’. దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కించిన ఏమోషనల్ స్పోర్ట్స్ డ్రామా ప్రీమియర్స్ నుంచే మంచి టాక్ సొంతం చేసుకుంది. అయితే ప్రీమియర్స్ కి కేవలం ఓవర్సీస్ మార్కెట్ నుంచే కాకుండా ఇండియా వైడ్ గా కూడా భారీ రెస్పాన్స్ సినిమాకి దక్కింది.

ఇలా మొదటి రోజుకి గాను పెద్ది సాలిడ్ ఓపెనింగ్స్ ని వరల్డ్ వైడ్ కన్నేసింది అని చెప్పొచ్చు. ఇలా మొదటి రోజు వసూళ్ల ప్రిడిక్షన్ ఇపుడు తెలుస్తోంది. దీని ప్రకారం పెద్ది సినిమా సుమారు 95 నుంచి 100 కోట్ల గ్రాస్ మార్కుని (ప్రీమియర్స్ కలిపి) అందుకుంటుంది అని తెలుస్తోంది. సో రామ్ చరణ్ నుంచి ఇది మరో సెన్సేషనల్ ఓపెనింగ్ అని చెప్పవచ్చు. ఇక అధికారిక నెంబర్స్ ఏ లెవెల్లో ఉంటాయో చూడాలి. ఇక ఈ సినిమాకి ఏ ఆర్ రెహ్మాన్ సంగీతం అందించారు. అలాగే వృద్ది సినిమాస్ నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

తాజా వార్తలు