యూట్యూబ్‌లో వరల్డ్ రికార్డ్ సృష్టించిన ‘T-సిరీస్’..!

యూట్యూబ్‌లో వరల్డ్ రికార్డ్ సృష్టించిన ‘T-సిరీస్’..!

Published on Dec 6, 2021 10:03 PM IST


యూట్యూబ్‌లో T-సిరీస్ ఛానల్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకుంది. T-సిరీస్ ఛానల్ సబ్‌స్క్రైబర్‌ల సంఖ్య 200 మిలియన్లకు చేరుకుంది. ఈ మైలురాయి సాధించిన మొదటి యూట్యూబ్ ఛానెల్‌గా T-సిరీస్ నిలిచింది. భూషణ్ కుమార్‌కు చెందిన ఈ T-సిరీస్ ఇండియాలో అతి పెద్ద మ్యూజిక్ కంపెనీగా కొనసాగుతోంది. T-సిరీస్ పేరుతో బాలీవుడ్‌లో పలు సినిమాలు కూడా నిర్మితం అవుతున్నాయి.

అయితే ఈ విజయాన్ని సంస్థ సభ్యులకు, మ్యూజిక్ టీమ్‌కు అంకితం చేస్తున్నట్లు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ భూషణ్ కుమార్ ప్రకటించారు. ఓ మ్యూజిక్ సంస్థ ఈ ఘనత సాధించడం భారతీయులందరికీ గర్వకారణమని, ఇంత పెద్ద స్థాయిలో తమ ఛానల్ సబ్‌స్రైబర్‌లను పొందడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. కాగా యూట్యూబ్‌లో ట్-సిరీస్‌ పేరుతో వేర్వేరు భాషల్లో 29 ఛానెళ్లు ఉన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు