స్టార్ రైటర్ చంద్రబోస్ ఇంట విషాదం.

Published on May 20, 2019 3:39 pm IST

ప్రముఖ సినీ గేయ రచయిత చంద్రబోస్‌ తల్లి మదనమ్మ సోమవారం గుండెపోటుతో కన్నుమూశారు.చంద్రబోస్‌ ది వరంగల్‌ జిల్లా చిట్యాల మండలం చల్లగిరి. చంద్రబోస్‌ తండ్రి నర్సయ్య ఉపాధ్యాయుడుకాగా తల్లి మదనమ్మ గృహణి. వీరికి నలుగురు కుమారులు .చంద్రబోస్ అందరికంటే చిన్నవాడు.

తనకు తల్లితో గల అనుబంధాన్ని ఎప్పుడూ గుర్తు చేసుకుంటూఉండేవారు చంద్రబోస్. “చిన్నప్పుడు తల్లితో కలిసి తమ గ్రామంలో ప్రదర్శించే ఒగ్గు కథలు, చిందు భాగవతాలు, నాటకాలు చూసేవాడిని, వాటి వల్లే పద్యాలు, పాటలపై ఆసక్తి పెంచుకున్నాను, నేను గేయ రచయిత కావడం వెనుక అమ్మ ఇచ్చిన స్ఫూర్తి ఎంతో ఉంది” అంటూ చంద్రబోస్‌ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చేవారు.కాగా సోమవారం సాయంత్రం చల్లగిరిలో మదనమ్మ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

సంబంధిత సమాచారం :

More