“రైటర్ పద్మభూషణ్” కి బుల్లితెర పై రెస్పాన్స్ ఇదే!

Published on Jun 8, 2023 9:00 pm IST


టాలీవుడ్ యంగ్ యాక్టర్ సుహస్ ప్రధాన పాత్రలో, షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వం లో తెరకెక్కిన కామెడీ ఎంటర్టైనర్ రైటర్ పద్మభూషణ్. ఈ చిత్రం థియేటర్ల లో విడుదల అయ్యి ప్రేక్షకులను విశేషం గా ఆకట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద కూడా మంచి వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రం ఇటీవల జీ తెలుగు లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రేక్షకుల ముందుకి వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే.

ఈ చిత్రానికి 2.57 టీఆర్పీ రేటింగ్ రావడం జరిగింది. అయితే ఇది ఈ చిత్రానికి డీసెంట్ రేటింగ్ అని చెప్పాలి. టినా శిల్ప రాజ్, రోహిణి, ఆశిష్ విద్యార్థి కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి కళ్యాణ్ నాయక్, శేఖర్ చంద్ర లు సంగీతం అందించారు. ఛాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ మరియు లహరి ఫిల్మ్స్ బ్యానర్ లపై ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది.

సంబంధిత సమాచారం :