సెన్సార్ పూర్తి చేసుకున్న’యమలీల 2′

సెన్సార్ పూర్తి చేసుకున్న’యమలీల 2′

Published on Nov 18, 2014 3:54 AM IST

yamaleela2 (1)
కెవి సతీష్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘యమలీల 2’. కుటుంబ కధా చిత్రాల దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం నేడు సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి ‘యు/ఏ’ సర్టిఫికేట్ ఇచ్చింది. నిర్మాణంతర కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 28న విడుదల చేస్తున్నారు.

కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు యముడిగా, కామెడీ కింగ్ బ్రహ్మానందం చిత్రగుప్తుడి పాత్రలలో నటించారు. సౌత్ ఆఫ్రికన్ మోడల్ దియా నికోలస్ హీరోయిన్ గా పరిచయమవుతుంది. యమలోకం నేపధ్యంలో సాగే సన్నివేశాల గ్రాఫిక్ వర్క్ మీద మూవీ యూనిట్ స్పెషల్ కేర్ తీసుకుంది. ఈ సన్నివేశాలు హైలైట్ గా నిలుస్తాయని భావిస్తున్నారు. క్రిష్వి ఫిల్మ్స్ నిర్మాణంలో ఈ చిత్రం తెరకెక్కింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు