
ఒకప్పుడు సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా పేరున్న ఎస్.వి కృష్ణారెడ్డి చాలా రోజుల గ్యాప్ తర్వాత ‘యమలీల 2’ సినిమా డైరెక్షన్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా గురించి ఎస్.వి కృష్ణారెడ్డి మాట్లాడుతూ ‘ ఈ సినిమా కథాంశాన్ని కంప్యూటర్ జేనరెటేడ్ ఇమాజినరీ కాన్సెప్ట్ తో తెరకెక్కుతోంది. హై క్వాలిటీ గ్రాఫిక్స్ తో ఆడియన్స్ ని ఎంటర్ టైన్ చేసేలా ఈ సినిమా ఉంటుంది. అలాగే ‘యమలీల’ సినిమాకి ఈ సినిమా కథకి ఎలాంటి సంబంధం ఉండదని’ అన్నాడు.
కెవి సతీష్ హీరోగా పరిచయమవుతున్న ఈ సినిమా ద్వారా సౌత్ ఆఫ్రికాకి చెందిన దియా నికోలస్ హీరోయిన్ హీరోయిన్ గా పరిచయం కానుంది. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు యముడుగా నటిస్తున్న ఈ సినిమాకి ‘ఈగ’ సినిమాకి విజువల్ ఎఫ్ఫెక్ట్స్ చేసిన ముక్త విఎఫ్ఎక్స్ వారు గ్రాఫిక్స్ చేస్తున్నారు. బ్రహ్మానందం చిత్ర గుప్తుడుగా, తనికెళ్ళ భరణి తోట రాముడుగా కనిపిస్తున్న ఈ సినిమాలో సదా, నిషా కొఠారి ప్రత్యేక పాత్రల్లో కనిపించనున్నారు.