అభిమాని కి అందాల భామ ఇంట్రెస్టింగ్ పోస్ట్

Published on Mar 6, 2023 9:30 am IST

బాలీవుడ్ హీరోయిన్ యామీ గౌతమ్‌ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం నెటిజన్లతో టచ్ లో ఉంటుంది. ఈ క్రమంలో యామీ గౌతమ్ కి ఓ నెటిజన్ సలహా ఇచ్చాడు. ‘మీరు మీ కోసం పబ్లిక్ రిలేషన్స్ (పీఆర్) ఏజెన్సీని నియమించుకోండి అంటూ అతను యామీ గౌతమ్ తో అన్నాడు. ఐతే, యామీ గౌతమ్ ట్విట్టర్ లో అతనికి సమాధానం ఇచ్చింది. ‘పీఆర్ పనులు వల్ల, పాజిటివ్ రివ్యూలు వల్ల, సినిమా ఇండస్ట్రీ పై అవగాహన వల్ల ఇలా ఎన్నో విషయాల పై ఆధారపడే నటులను నేను చూశాను.

అయితే, నేను ఎవరినీ జడ్జ్ చేయడం లేదు. కానీ, ‘నీవు చేసే పని నీకు మంచి పీఆర్ అవుతుంది’అన్నది నేను నమ్ముతాను. సొంతంగా పేరు తెచ్చుకునేందుకే నేను ప్రయత్నం చేస్తాను అంటూ యామీ గౌతమ్ చెప్పుకొచ్చింది. యామీ గౌతమ్ రీసెంట్ గా అనిరుద్ధ రాయ్ చౌదరీకి చెందిన థ్రిల్లర్ సినిమా ‘లాస్ట్’లో నటించింది. ఈ నెల 24న నెట్ ఫ్లిక్స్ లో విడుదలయ్యే ‘చోర్ నికాల్ కే బాగా’ లో కనిపించనుంది.

సంబంధిత సమాచారం :