‘కాంతార’ను డామినేట్ చేసిన ‘టాక్సిక్’

‘కాంతార’ను డామినేట్ చేసిన ‘టాక్సిక్’

Published on Aug 26, 2026 11:33 PM IST

రాకింగ్ స్టార్ యష్ హీరోగా గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘టాక్సిక్’ చిత్రం అడ్వాన్స్ బుకింగ్స్‌లో సంచలన రికార్డులను సృష్టిస్తోంది. ప్రముఖ టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్ బుక్‌మైషోలో ఏకంగా 1.62 మిలియన్‌కు పైగా టికెట్లు అమ్ముడై అత్యధిక అడ్వాన్స్ సేల్స్ సాధించిన భారతీయ సినిమాల జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది.

ఈ ఘనత ద్వారా ‘కాంతార చాప్టర్ 1’, ‘ధురంధర్ 2’ వంటి భారీ చిత్రాల రికార్డులను కూడా ‘టాక్సిక్’ అధిగమించడం విశేషం. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ చిత్రానికి బుకింగ్స్ అద్భుతంగా జరుగుతున్నాయి. దీంతో తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్లకు పైగా గ్రాస్ సాధించే దిశగా ఈ సినిమా పయనిస్తోంది.

ఈ చిత్రంలో డ్యుయల్ రోల్ చేసిన యష్ నటనపై, ఆయన స్క్రీన్ ప్రజెన్స్ పై ప్రేక్షకులతో పాటు విమర్శకులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సినిమా హాలీవుడ్ స్థాయిలో మేకింగ్ ఉండటం అందరినీ విశేషంగా ఆకట్టుకుంటోంది. కెవిఎన్ ప్రొడక్షన్స్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం, అడ్వాన్స్ బుకింగ్స్‌తో క్రియేట్ చేసిన బజ్‌ను బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయి వసూళ్లుగా మారుస్తుందో వేచి చూడాలి.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు