ఫైనల్ గా యష్ ‘టాక్సిక్’ రిలీజ్ అప్పటికి ఖరారు..!

ఫైనల్ గా యష్ ‘టాక్సిక్’ రిలీజ్ అప్పటికి ఖరారు..!

Published on Jun 21, 2026 1:58 AM IST

Toxic

కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా నటించిన తాజా అవైటెడ్ సినిమానే టాక్సిక్. గీతూ మోహన్ దాస్ తెరకెక్కించిన ఈ భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామా కోసం అభిమానులు అసక్తిగానే ఎదురు చూస్తున్నారు. కానీ మిగతా ఆడియెన్స్ లో మాత్రం అంత హైప్ ని ఈ సినిమా జెనరేటర్ చేయలేకపోయింది. దీనితో మేకర్స్ కూడా అలా సినిమాని ఆలస్యం చేస్తూ వస్తుండడంతో ఉన్న అంచనాలు కూడా తగ్గాయి.

కానీ ఎట్టకేలకు ఈ జూన్ 21న సినిమా అప్డేట్ అందిస్తున్నట్టు తెలిపారు. మరి లేటెస్ట్ బజ్ ప్రకారం సినిమా విడుదల ఆగస్ట్ నెలకి ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. సో మిగతా మిడ్ రేంజ్ సినిమాలకి ఇదేమన్నా ఎఫెక్ట్ అవుతుందా లేక క్లాష్ లేకుండానే టాక్సిక్ వస్తుందా అనేది వేచి చూడాలి. ఇక ఈ సినిమాకి రవి బసృర్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే యష్ సహా కే వి ఎన్ ప్రొడక్షన్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు