సీఎం కి కెజిఎఫ్ హీరో యష్ సీరియస్ రిక్వెస్ట్

Published on Mar 1, 2020 2:21 am IST

సౌత్ లో క్రేజీ హీరోలలో యష్ ఒకరు. కెజిఎఫ్ చిత్రం తరువాత ఆయన విపరీతమైన ఫాలోయింగ్ తెచ్చుకున్నారు. ఆ చిత్రం సెన్సేషనల్ హిట్ కాగా పాన్ ఇండియా మూవీగా విడుదలై అన్ని భాషలలో విజయం సాధించింది. ఇక కెజిఎఫ్ చిత్రానికి కొనసాగింపుగా కెజిఎఫ్ 2 తెరకెక్కుతుంది. కె జి ఎఫ్ 2 ఈ ఏడాది జులై లో విడుదల కానుంది.

కాగా హీరో యష్ కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్పకు ఓ విన్నపం చేశారు. బెంగుళూరులో ఓ పెద్ద ఫిల్మ్ సిటీ నిర్మించాలని కోరాడు. కన్నడ చిత్ర పరిశ్రమ గత కొన్నేళ్లుగా చాల అభివృద్ధి చెందినప్పటికీ షూటింగ్ అవసరాల కోసం ఇంకా పక్క రాష్ట్రాలకు వెళ్లాల్సివస్తుంది అన్నారు. యష్ చేసిన ఈ రిక్వెస్ట్ ని సీఎం పరిశీలిస్తానన్నారు.

సంబంధిత సమాచారం :