
మహి వి రాఘవ్ దర్శకత్వంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్య మంత్రి , దివంగత నేత వై ఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘యాత్ర’. ఈచిత్రంలో వైఎస్సార్ పాత్రలో మలయాళ మెగా స్టార్ మమ్ముట్టి నటిస్తున్నారు. ఇక డిసెంబర్ 21న విడుదల చేసిన ఈచిత్రం యొక్క టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటివరకు ఈ టీజర్ 30లక్షల డిజిటల్ వ్యూస్ ను రాబట్టుకుంది. ఇక అప్పట్లో ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేసి సెన్సేషన్ సృష్టించారు. ఇప్పుడు ఆ విశేషాలను ఈ చిత్రంలో చూపించనున్నారు.
కృష్ణ కుమార్ సంగీతం అందిస్తున్న ఈచిత్రం లో జగపతి బాబు , సుహాసిని , అనసూయ , రావు రమేష్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. 70ఎమ్ ఎమ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంఫై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డిలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరి 8న తెలుగు తోపాటు మలయాళం, తమిళ భాషల్లో విడుదలకానుంది. మళయాలం ,తమిళ్లో మమ్ముట్టి కి మంచి ఫాలోయింగ్ ఉండడంతో ఈ చిత్రాన్ని అక్కడ కూడా విడుదల చేస్తున్నారు.
టీజర్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి