‘ఎందుకో ఏమో’ విడుదల తేదీ ఖరారు !
Published on Sep 8, 2018 1:00 pm IST

నందు,నోయల్‌, పునర్నవి భూపాలం హీరో హీరోయిన్లుగా కోటి వద్దినేని దర్శకత్వంలో మహేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై మాలతి వద్దినేని నిర్మిస్తోన్న చిత్రం ‘ఎందుకో ఏమో’. ఇటీవల విడుదలైన ఈ చిత్రం యొక్క టీజర్ , సాంగ్స్ సినిమా పై ఆసక్తిని తీసుకొచ్చింది . పోసాని కృష్ణ మురళి , సుడిగాలి సుధీర్‌, నవీన్‌, రాకెట్‌ రాఘవ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ప్రవీణ్ సంగీతం అందించారు.

అన్ని కార్యాక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబర్‌ 12న వినాయక చవితి కానుకగా విడుదలవుతుంది. ఈ సందర్భంగా ఈ రోజు ప్రసాద్‌ ల్యాబ్స్‌లో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. నటుడు నోయల్‌ మాట్లాడుతూ నందు మంచి యాక్టర్‌. తనతో ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్నా ఈ సినిమాతో కుదిరింది. ఈ సినిమాకు సంగీతం, సినిమాటోగ్రఫీ ప్రధాన ఆకర్షణలు . పునర్నవి సహజ నటి. ఈసినిమాతో తనకు మంచి పేరొస్తుంది. ఇంత మంచి సినిమాలో అవకాశం కల్పించిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు.

హీరో నందు మాట్లాడుతూ లేడీ ప్రొడ్యూసర్‌ తో సినిమా చేయడం ఇదే ప్రధమం. ఎంతో అభిరుచితో సినిమా చేశారు. మా దర్శకుడు నన్ను నమ్మి ఈ సినిమాలో అవకాశం కల్పించారు. సంగీతం, సినిమాటోగ్రఫీ సినిమాకు హైలెట్స్‌. పునర్నవి, నోయల్‌ మంచి ఫ్రెండ్సయ్యారు అన్నారు.

దర్శకుడు కోటి వద్దినేని మాట్లాడుతూ ఇదొక ట్రయాంగిల్‌ వ్‌స్టోరి. ఫ్యామిలీ, యూత్‌ కి నచ్చే విధంగా ఉంటుంది. నందు, నోయల్‌,పునర్నవి పోటా పోటీగా నటించారు. క్లైమాక్స్‌ సినిమాకు హైలైట్‌గా నిలుస్తుంది. కథ, కథనాలు కొత్తగా ఉంటూ అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధమైన ఎంటర్టైన్మెంట్‌ ఉంటుంది.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook