అజిత్ కుమార్, త్రిష మరియు అనుష్కలు నటించిన ‘ఎన్నై అరిందినాల్’ సినిమా ప్రకటించిన నాటినుండీ వార్తలలో నిలుస్తుంది. గౌతం మీనన్ ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు.
ఈ సినిమా నిర్మాత ఏ.ఎమ్ రత్నం చిత్రానికి తుదిమెరుగులు దిద్దుతున్నట్టు సెన్సార్ కి జనవరి 21న సిద్ధమవుతున్నట్టు సమాచారం. ప్రపంచవ్యాప్తంగా వున్న అభిమానులను అలరించడానికి ఈ సినిమా జనవరి 29న విడుదలకు సిద్ధపడుతుంది.


