దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, న్యాచురల్ స్టార్ నాని కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ ‘ది పారడైజ్’ నుంచి సెకండ్ సింగిల్ సాంగ్‌పై గతకొద్ది రోజులుగా వస్తున్న వార్తలను మేకర్స్ నిజం చేశారు. ఈ సినిమాలో సెకండ్ సింగిల్ సాంగ్‌గా ‘యెషనాగుల కట్ట మీద’ అనే పక్కా తెలంగాణ ఫోక్ మాస్ సాంగ్‌ను విడుదల చేయడానికి చిత్రబృందం సిద్ధమైంది.
‘దసరా’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై మొదటి నుంచీ అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ క్రేజీ అప్‌డేట్‌ను శ్రీకాంత్ ఓదెల సోషల్ మీడియాలో పంచుకోగా, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ దానిని రీపోస్ట్ చేశాడు. పక్కా తెలంగాణ యాస మరియు నేటివిటీ ప్రతిబింబించేలా రూపుదిద్దుకున్న ఈ పాటకు కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించగా, జంగి రెడ్డి మరియు ప్రభ ఆలపించారు.
అనిరుధ్ కంపోజ్ చేసిన ఈ మాస్ రఫ్ ఫోక్ నెంబర్ ఆగస్టు 29న విడుదల కానుంది. ‘దసరా’లో ‘ధూమ్ ధామ్’ పాట ఎంతటి ఘనవిజయం సాధించిందో, ఈ ‘యెషనాగుల’ పాట కూడా అదే స్థాయిలో చార్ట్‌బస్టర్‌గా నిలుస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.
YES, it’s #YESHANAGULA 🔥🔥🔥💥💥
Lyrics: Kasarla Shyam
Singers: Jangi Reddy, Prabha.
Music: Anirudh.Out on August 29th 🙂 pic.twitter.com/JcwGcYNDZF
— Srikanth Odela (@odela_srikanth) August 27, 2026


