సి ఐ ఎస్ ఎఫ్ అకాడమి సందర్శించిన సూపర్ స్టార్ మహేష్

Published on Jan 19, 2020 11:09 am IST

సూపర్ స్టార్ మహేష్ నిన్న హైదరాబాద్ లోని సి ఐ ఎస్ ఎఫ్ నేషనల్ సెక్యూరిటీ అకాడమీని సందర్శించారు. అక్కడ ఉన్న అధికారులతో ఆయన ఇంటరాక్ట్ అయ్యారు. అలాగే అక్కడ శిక్షణ పొందుతున్న యంగ్ ఫోర్స్ తో ఆయన మాట్లాడటం జరిగింది. మహేష్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ సరిలేరు నీకెవ్వరు చిత్రంలో మహేష్ అజయ్ కృష్ణ అనే ఆర్మీ మేజర్ రోల్ చేసిన సంగతి తెలిసిందే. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం రికార్డు కలెక్షన్స్ సాధించి బ్లాక్ బస్టర్ హిట్ దిశగా సాగుతుంది. యూఎస్ లో కూడా సరిలేరు నీకెవ్వరు మూవీ $2 మిలియన్ వసూళ్లను చేరుకోవడం విశేషం. మహేష్ కెరీర్ లో ఈ ఫీట్ సాధించిన మూడవ చిత్రం సరిలేరు నీకెవ్వరు.

దిల్ రాజు సమర్పణలో అనిల్ సుంకర సరిలేరు నీకెవ్వరు చిత్రాన్ని నిర్మించగా అనిల్ రావిపూడి తెరకెక్కించారు. హీరోయిన్ రష్మిక మహేష్ కి జంటగా నటించింది. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి భారతి అనే కాలేజ్ ప్రొఫెసర్ రోల్ చేశారు. రాక్ స్టార్ దేవిశ్రీ సరిలేరు నీకెవ్వరు చిత్రానికి సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం :

X
More