నిన్న ఒక సినిమా పూర్తి ఈరోజు మరో సినిమా మొదలు !

నిన్న ఒక సినిమా పూర్తి ఈరోజు మరో సినిమా మొదలు !

Published on Mar 2, 2018 1:08 PM IST

బెల్లంకొండ శ్రీనివాస్ నటిస్తోన్న సాక్షం సినిమా షూటింగ్ నిన్నటితో పూర్తి అయ్యింది. ఈరోజు నుండి నూతన దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వం వహించబోయే సినిమా షూటింగ్ లో జాయిన్ అయ్యాడు. గ్యాప్ లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్నాడు ఈ హీరో. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన సాక్షం సినిమాను శ్రీ వాసు దర్శకత్వం వహించాడు. మీనా ఈ సినిమాలో హీరో తల్లి పాత్రలో కనిపించబోతోంది.

మాస్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కబోతోంది. శ్రీనివాస్ రెడ్డి సినిమా అందుకు భిన్నంగా ఉండబోతోందని తెలుస్తోంది. థ్రిల్లర్ నేపద్యంలో రూపొందే ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తుండగా కాజల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రంలో మరో హీరోయిన్ నటించే అవకాశాలు ఉన్నాయి. త్వరలో ఆ వివరాలు తెలియనున్నాయి.

తాజా వార్తలు