నితిన్ ‘తమ్ముడు’ లో కీలక రోల్ చేయనున్న ఒకప్పటి హీరోయిన్ ?

నితిన్ ‘తమ్ముడు’ లో కీలక రోల్ చేయనున్న ఒకప్పటి హీరోయిన్ ?

Published on Sep 1, 2023 2:00 AM IST

laya

యువ నటుడు నితిన్ హీరోగా ప్రస్తుతం వక్కంతం వంశీ దర్శకత్వంలో ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ మూవీ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. డిసెంబర్ లో ఈ మూవీ ఆడియన్స్ ముందుకి రానుంది. ఇక తాజాగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మాతగా వకీల్ సాబ్ దర్శకుడు వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఒక సినిమాని ప్రారంభించారు నితిన్. ఈ మూవీ సిస్టర్ సెంటిమెంట్ తో కూడిన ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది.

అయితే మ్యాటర్ ఏమిటంటే, తమ్ముడు టైటిల్ తో తెరకెక్కనున్న ఈ మూవీలో నితిన్ కి అక్క పాత్రలో ఒకప్పటి స్టార్ హీరోయిన్ లయ నటించనున్నట్లు టాక్. ఆమె పాత్ర ఈ సినిమాలో ఎంత కీలకం అని అంటున్నారు. ఇక ఈ మూవీలో కాంతారా ఫేమ్ సప్తమి గౌడ హీరోయిన్ గా నటిస్తుండగా శుక్రవారం నుండి షూటింగ్ జరుపుకోనున్న ఈ మూవీ గురించిన మరిన్ని వివరాలు త్వరలో అధికారికంగా వెల్లడి కానున్నాయి.

తాజా వార్తలు