ప్రభాస్ లిస్టులో మరో బాలీవుడ్ హీరోయిన్ ?

18th, May 2017 - 11:58:15 AM


రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం సుజీత్ దర్శకత్వంలో ‘సాహో’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనేది పెద్ద సస్పెన్స్ గా మారింది. ‘బాహుబలి-2’ తో ప్రభాస్ జాతీయ స్థాయి హీరోగా మారిపోవడంతో ఆయన పక్కన నటించే ఛాన్స్ ఏ లక్కీ హీరోయిన్ కు దక్కుతుందో తెలుసుకోవాలని అందరిలోను అమితాశక్తి ఉంది. దీంతో రోజుకో బాలీవుడ్ హీరోయిన్ పేరు వినిపిస్తోంది.

మొదట కత్రినా కైఫ్, పూజ హెగ్డే, దీపికా పాడుకొనేల పేర్లు వినబడగా తాజాగా మరో హీరోయిన్ పేరు తెరపైకొచ్చింది. ఆమే పరిణీతి చోప్ర. ప్రస్తుతం సాహో నిర్మాతలు పరిణీతితో చర్చలు జరుపుతున్నారని అంటున్నారు. అయితే ఈ విషయంపై ఎలాంటి అధికారిక సమాచారం అయితే వెలువడలేదు. మరి ఇంతమంది హీరోయిన్ల మధ్య చివరికి ఎవరిని ఫైనల్ చేస్తారో చూడాలి. యువీ క్రియేషన్స్ బ్యానర్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది.