‘బాహుబలి’లో భాగమైన మరో టాప్ నిర్మాత

‘బాహుబలి’లో భాగమైన మరో టాప్ నిర్మాత

Published on May 3, 2015 12:43 PM IST

baahubali
తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ స్థాయికి పరిచయం చేసే దిశగా భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా ‘బాహుబలి’. షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ కోసం మే 31ని, రిలీజ్ కోసం జూలై 10ని లాక్ చేసారు. ఈ డేట్స్ ని లాక్ చేయడంతో ఈ సినిమా ప్రమోషన్స్ కూడా మొదలయ్యాయి. ప్రమోషన్స్ మొదటి స్టెప్ గా బాహుబలి ఫస్ట్ లుక్ పోస్టర్ ని మే 1న రిలీజ్ చేసారు. ఈ ఫస్ట్ లుక్ కి అందరి నుంచీ సూపర్బ్ రెస్పాన్స్ రావడమే కాకుండా పాపులర్ బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ హిందీ రైట్స్ దక్కించుకోవడంలో హ్యాపీగా ఉండడమే కాకుండా, ఫస్ట్ లుక్ పై ప్రశంశల జల్లు కురిపించారు.

ఇలాంటి ప్రశంశల జల్లు కురిపించిన వీరందరి జాబితాలో మరో టాప్ ప్రొడ్యూసర్ కూడా జాయిన్ అయ్యాడు. అన్తనే తమిళ నిర్మాత జ్ఞానవేల్ రాజా.. ‘సూపర్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి – యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్ లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘బాహుబలి’తో నేను భాగస్వామ్యం అయినందుకు చాలా హ్యాపీగా ఉన్నాను. నా కెరీర్లో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఇదే, ఫస్ట్ లుక్ కూడా చాలా బాగుందని’ జ్ఞానవేల్ రాజా ట్వీట్ చేసాడు. జ్ఞానవేల్ రాజా స్టూడియో గ్రీన్ బ్యానర్ పై బాహుబలి తమిళ రైట్స్ ని సొంతం చేసుకున్నారు.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఫుల్ స్వింగ్ మీదున్నాయి. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాని ఆర్కా మీడియా వారు నిర్మించారు. ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు