తాము కనపడకుండా ఎప్పుడూ తమ వాయిస్ తో పాటల రూపంలో తెలుగు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్న సింగర్స్ ఈ మధ్య నటులుగా అవతారం ఎత్తుతున్నారు. ఇండియన్ ప్లే బ్యాక్ సింగర్ అయిన బాబా సెహగల్ నాగ చైతన్య – గౌతమ్ వాసుదేవ్ మీనన్ సినిమాలో విలన్ పాత్ర, అది కూడా పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడని ఇది వరకే తెలియజేశాం. ఇప్పుడు అతని బాటలోనే మరో సింగర్ కూడా నటుడిగా మారనున్నాడు. అతనే విజయ్ ఏసుదాస్.
అలనాటి స్టార్ సింగర్ కెజె ఏసుదాస్ కుమారుడైన విజయ్ ఏసుదాస్ కూడా సింగర్ గా చాలా మంచి పేరు తెచ్చుకోవడమే కాకుండా తెలుగు, తమిళ భాషల్లో వరుసగా పాటలు పాడుతున్నాడు. అలాంటి సింగర్ తమిళ స్టార్ హీరో ధనుష్ నటించిన ‘మారి’ సినిమాతో నటుడిగా మారనున్నాడు. అలాగే ఈ సినిమాలో తను ఓ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. ఇటీవలే రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. విజయ్ ఏసుదాస్ తెలుగులో గోవిందుడు అందరివాడేలే, దృశ్యం, లెజెండ్, కడలి మొదలైన సినిమాల్లో పాటలు పాడాడు.


