యువ హీరో నాని నటించిన తాజా సినిమా ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ ఆడియోను శనివారం నాడు చిత్ర ప్రముఖుల సమక్షంలో విడుదల చేయనున్నారు. ఈ సినిమాకు ‘అందాల రాక్షసి’ ఫేం రదన్ సంగీతం అందించారు. ఈ సినిమా ద్వారా మాళవిక నాయర్ హీరోయిన్ గా పరిచయం అవుతుంది. రితు వర్మ మరొక హీరోయిన్.
స్వప్న సినిమా పతాకంపై ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ కుమార్తెలు స్వప్న దత్, ప్రియాంక దత్ నిర్మిస్తున్న ఈ సినిమా ద్వారా శేఖర్ కమ్ముల శిష్యుడు నాగ్ అశ్విన్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కు మంచి స్పందన లభించింది. మౌంట్ ఎవరెస్ట్ వద్ద బేస్ క్యాంపులో షూటింగ్ జరిపిన సన్నివేశాలు సినిమాకు హైలైట్ అవుతాయని చిత్ర బృందం భావిస్తుంది. ఈ సినిమాకు రాకేశ్ – నవీన్ సినిమాటోగ్రాఫర్స్ గా పని చేస్తున్నారు.


