ఎవడు కొత్త ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్

Published on Jan 3, 2014 9:45 pm IST

yevadu
రామ్ చరణ్ వందలమంది అభిమానుల నడుమ ఈరోజు ‘ఎవడు’ సినిమా ప్రచారంలో భాగంగా ఈ సినిమా రెండో ట్రైలర్ ను హైదరాబాద్ సంధ్య థియేటర్ లో విడుదలచేశారు. ఈ ట్రైలర్ ను చూస్తే ఈ సినిమా మాస్ ఎంటర్టైనర్ అనడంలో ఎటువంటి సందేహంలేదు. ఇంటర్నెట్ లో విడుదలైన దగ్గరనుంచి దీని రెస్పాన్స్ అద్భుతంగా వచ్చింది

2013రామ్ చరణ్ కు మిశ్రమ స్పందనను ఇచ్చింది. నాయక్ సంక్రాంతికి హిట్ అయినా తన మొదటి బాలీవుడ్ సినిమా జంజీర్ పరాజయంపాలైంది. కాకపోతే ఈ ఎవడు సినిమాపై హీరోతో పాటూ బృందమంతా నమ్మకంగా వున్నారు. ఈ వేడుకలో చెర్రీ మాట్లాడుతూ “నేను అభిమానులతో గడిపే సమయాన్ని ఎన్నటికీ వదులుకొను. అభిమానులను మెప్పించే అంశాలు ఈ సినిమాలో వున్నాయి. నా సినిమానే కాక సంక్రాంతికి విడుదలయ్యే అన్నీ సినిమాలు విజయం సాధించాలని కోరుకుంటున్నా” అని అన్నాడు

వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శృతిహాసన్ మరియు అమీ జాక్సన్ హీరోయిన్స్. అల్లు అర్జున్, కాజల్ అగర్వాల్ అతిధి పాత్రధారులు. దిల్ రాజు నిర్మాత. దేవీశ్రీప్రసాద్ సంగీతదర్శకుడు. శ్యామ్ కె నాయుడు సినిమాటోగ్రాఫర్. ఈ చిత్రం జనవరి 12న మనముందుకు రానుంది

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :