సెన్సార్ ప‌నులు ముగించుకున్న ‘యేవ‌మ్’ మూవీ

సెన్సార్ ప‌నులు ముగించుకున్న ‘యేవ‌మ్’ మూవీ

Published on Jun 13, 2024 10:01 PM IST

యంగ్ బ్యూటీ చాందిని చౌద‌రి లీడ్ రోల్ లో న‌టిస్తున్న తాజా చిత్రం ‘యేవ‌మ్’. పూర్తి క్రైమ్ థ్రిల్ల‌ర్ స‌బ్జెక్టుతో తెర‌కెక్కిన ఈ సినిమాను ప్ర‌కాశ్ దంతులూరి డైరెక్ట్ చేస్తున్నారు. ఇప్ప‌టికే రిలీజ్ అయిన ఈ చిత్ర పోస్ట‌ర్స్, టీజ‌ర్, ట్రైల‌ర్ల‌కు మంచి స్పంద‌న ల‌భించింది. ఇక జూన్ 14న రిలీజ్ కు రెడీ అయిన ఈ సినిమా తాజాగా సెన్సార్ కూడా ముగించుకుంది.

‘యేవ‌మ్’ చిత్రానికి సెన్సార్ బోర్డు U/A స‌ర్టిఫికెట్ ను జారీ చేసింది. సినిమాలోని కంటెంట్ ప్రేక్ష‌కుల‌కు న‌చ్చే విధంగా ఉన్న‌ప్ప‌టికీ.. క్రైమ్ సీన్స్, యాక్ష‌న్ డోస్ కాస్త ఎక్కువ ఉన్న కార‌ణంతో ఈ సినిమాకు U/A స‌ర్టిఫికెట్ జారీ చేసిన‌ట్లుగా తెలుస్తోంది. ఇక చాందిని చౌద‌రి ప‌ర్ఫార్మెన్స్ ఈ సినిమాకు మేజ‌ర్ అసెట్ కానుంద‌ని చిత్ర యూనిట్ ధీమా వ్య‌క్తం చేస్తోంది.

ఈ సినిమాలో వశిష్ట సింహా, జై భ‌ర‌త్ రాజ్, అషు రెడ్డి, గోప‌రాజు ర‌మణ త‌దిత‌రులు ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ సినిమాను న‌వ‌దీప్ ప్రొడ్యూస్ చేస్తుండ‌టంతో సినీ స‌ర్కిల్స్ లోనూ ఈ సినిమాపై మంచి బ‌జ్ క్రియేట్ అయ్యింది. మ‌రి ఈ సినిమాకు ప్రేక్ష‌కులు ఎలాంటి రిజ‌ల్ట్ ను ఇస్తారో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు