కేరళకు భారీ విరాళాన్ని ప్రకటించిన యువ హీరో !

కేరళకు భారీ విరాళాన్ని ప్రకటించిన యువ హీరో !

Published on Aug 21, 2018 8:22 PM IST

yound hero

వరదలతో తీవ్ర అవస్థలు పడుతున్న కేరళ ప్రజలకు సాయం చేయడానికి సినీ ప్రముఖులు ముందుకు వస్తున్నారు. టాలీవుడ్ , కోలీవుడ్ నటులనుండి భారీగా విరాళాలనుఅందుతున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు తాజాగా బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఏకంగా కోటి రూపాయల ను విరాళం గా ఇచ్చారు. దక్షిణాది రాష్ట్రం కేరళలోలో జరిగిన ఈ విపత్తుకు బాలీవుడ్ స్టార్ హీరోల నుండి సరైన స్పందన రాలేదు. కానీ ఒక యువ నటుడు ఇంత పెద్ద మొత్తంలో వరద బాధితుల కోసం విరాళం ను ప్రకటించడం విశేషం.

ఇక సుశాంత్ భారత క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని జీవిత కథ తో తెరకెక్కిన’ ఎమ్ ఎస్ ధోని’ చిత్రం లో ధోని గా నటించి తెలుగు , తమిళ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఇప్పుడు ఆయన ప్రస్తుతం ధోని చిత్రానికి సీక్వెల్ గా రానున్న చిత్రంలో నటించటానికి సిద్దమవుతున్నాడు.

తాజా వార్తలు