
బాహుబలి చిత్రంలో రానా తనయుడిగా నటించిన అడవి శేష్ ఈ సినిమా విజయంతో ఆనందంలో వున్నాడు. పంజా, రన్ రాజా రన్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన శేష్ బాహుబలి విజయం తరువాత మరిన్ని మంచి అవకాశాల కోసం ఎదురుచూస్తున్నాడు.
ఒక జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో “నా స్క్రీన్ టైం తక్కువ వున్నా బాహుబలిలో నా పాత్రకి ప్రాధాన్యత వుంది. ఈ సినిమా కధ వినగానే ఒక మైలురాయిగా నిలిచిపోతుందని భావించా. తెలుగు, తమిళ, హిందీ వెర్షన్ లలో నా పాత్రకు నేనే డబ్బింగ్ చెప్పుకున్నా” అని తెలిపాడు.

