
ఈ ఏడాది నార్త్ ఇండియన్ నుంచి టాలీవుడ్ కి దిగుమతి అయిన భామ సొనారిక బడోరియా.. ఈ ఏడాది జాదూగాడు సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ భామకి ఆ సినిమా హిట్ ఇవ్వకపోయినా తన పెర్ఫార్మన్స్ కి మాత్రం మంచి మార్కులే పడ్డాయి. అలాగే గ్లామర్ ట్రీట్ కి కూడా నో చెప్పక పోవడంతో ఈ భామకి తెలుగులో వరుసగా ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం ఈ భామ బెల్లంకొండ శ్రీనివాస్ నటిస్తున్న రెండవ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.
అలాగే మంచు విష్ణు హీరోగా నటిస్తున్న సరదా సినిమాలో కూడా ఆఫర్ కొట్టేసింది. ప్రస్తుతం ఈ రెండు సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. ఇది కాకుడా తాజాగా ఈ భామ యంగ్ హీరో సందీప్ కిషన్ నెక్స్ట్ సినిమాలో కూడా ఛాన్స్ కొట్టేసింది. పాపులర్ డైలాగ్ రైటర్ రాజసింహా డైరెక్షన్ లో సందీప్ కిషన్ ‘ఒక్క అమ్మాయి తప్ప’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో సొనారిక బడోరియా ని హీరోయిన్ గా సెలక్ట్ చేసారు. మొదటి సినిమా ఫ్లాప్ అయినప్పటికీ సొనారిక మాత్రం తెలుగులో వరుస ఆఫర్స్ తో బిజీ అయిపోతూ అందరినీ షాక్ కి గురిచేస్తోంది.

