
హిందీ టీవీ సీరియల్ ‘ఝాన్సీ కి రాణి’ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న బాల నటి ఉల్కా గుప్తా. ఆ సీరియల్ వల్ల ఉల్కా గుప్తాకి తెలుగులో ప్రతిష్టాత్మక సినిమా యిన ‘రుద్రమదేవి’ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. రుద్రమదేవి సినిమాలో యంగ్ ప్రిన్సెస్ పాత్రలో ఉల్కా గుప్తా కనిపించనుంది. అంతే కాకుండా ఉల్కా గుప్తా సోలో హీరోయిన్ గా ఆకాష్ పూరికి జోడీగా ‘ఆంధ్రా పోరి’ సినిమాలో నటించింది. ఈ సినిమా కూడా మేలో రిలీజ్ కానుంది.
ఈ భామ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన మనసులో ఉన్న మాటని బయటపెట్టింది. ‘నాకు టాలీవుడ్ లో మహేష్ బాబు, అల్లు అర్జున్, నితిన్ మరియు అఖిల్ అంటే చాలా ఇష్టం. వీరితో కలిసి నటించాలనేది నా డ్రీం’ అని తెలిపింది. అలాగే రుద్రమదేవి టీంతో ఎదురైనా అనుభవం గురించి చేనుతూ ‘నేను ప్రత్యేకంగా కత్తి యుద్దాలు, గుర్రపు స్వారీ నేర్చుకోలేదు. అంతకు ముందే నేర్చుకోవడం వలన చాలా ఈజీగా చేసేసాను. అది చూసిన అల్లు అర్జున్ గారు సెట్లో నాకు ఇచ్చిన కాంప్లిమెంట్స్ ఎప్పటికీ మర్చిపోలేనని’ తెలిపింది. మరి ఈ యంగ్ హీరోయిన్ కోరిక నెరవేరుతుందా లేదా అన్నది కాలమే నిర్ణయించాలి.

