‘ధృవ్’ సరసన యంగ్ బ్యూటీ ఫిక్స్ !

‘ధృవ్’ సరసన యంగ్ బ్యూటీ ఫిక్స్ !

Published on May 8, 2021 11:00 PM IST

తమిళ స్టార్ చియాన్ విక్రమ్ కుమారుడు ‘ధృవ్’, ‘అర్జున్ రెడ్డి’ రీమేక్ తో తమిళంలో హీరోగా ఎంట్రీ ఇచ్చి, ఫుల్ ఫాలోయింగ్ సంపాదించాడు. క్యారెక్టర్ కోసం బాడీని ఎలాగైనా మార్చుకోగలిగే స్కిల్ తో మంచి పేరు తెచ్చుకున్నాడు. పైగా మొదటి సినిమాతోనే వేరియేషన్స్ చూపిస్తూ యాంగ్రీ యంగ్ మ్యాన్ అనిపించుకున్నాడు. ఇక తన తరువాత సినిమాల కోసం ఇప్పటికే రెండు స్క్రిప్ట్స్ ను లైన్ లో పెట్టిన ఈ యంగ్ హీరో, జూన్ నుండి కొత్త సినిమాని స్టార్ట్ చేయనున్నాడట.

కాగా మురగదాస్ అసిస్టెంట్ రవికాంత్ అనే కొత్త డైరెక్టర్ డైరెక్షన్ లో సినిమాని చేయబోతున్నాడట. కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా యంగ్ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ ను తీసుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తల పై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు. సోషల్ మీడియా పుణ్యమా అని ఓవర్ నైట్ లోనే ఫుల్ క్రేజ్ సంపాదించిన ప్రియా ప్రకాష్, ప్రస్తుతం మంచి ఆఫర్లు కోసం ఎదురుచూస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు