చిరంజీవి జాబితాలో యువ దర్శకుడు కూడ ఉన్నాడు !
Published on Mar 11, 2018 10:58 pm IST

ఈ ఏడాది దర్శకులుగా పరిచయమైన వారిలో యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ కొంత భిన్నమైన ప్రత్యేకతను సంతరించుకున్నారు. అందుకు కారణం ఆయన తెరకెక్కించిన ‘అ !’ చిత్రం. ఈ సినిమాలో క్లిష్టమైన కథను ఆయన వివరించిన తీరు ప్రేక్షకుల్లో చాలా మందికి నచ్చింది. ఈ సక్సెస్ సందర్బంగా మీడియాతో మాట్లాడిన ఆయన చిన్నప్పటి నుండి తనకిష్టమైన మెగాస్టార్ చిరంజీవిగారు ఇచ్చిన కాంప్లిమెంట్ ను గుర్తుచేసుకుని పొంగిపోయారు.

మెగాస్టార్ చిరంజీవిగారికి కథ చెప్పడానికి వెళ్ళినప్పుడు నా కథ విన్న చిరంజీవిగారు కథ చెప్పడంలో నాకు ఇష్టమైన ఐదుగురు దర్శకుల్లో నువ్వు కూడ ఒకడివి అని మెచ్చుకున్నారు. ఆ కాంప్లిమెంట్ ను నేను ఎప్పటికీ మర్చిపోలేను అన్నారు. ప్రశాంత్ వర్మ గతంలో కూడ తనకు చిరంజీవి, బాలక్రిష్ణలతో ఒక మల్టీ స్టారర్ చేయాలనుందని చెప్పి అందరిలోనూ ఆసక్తిని రేకెత్తించిన సంగతి తెలిసిందే.

 
Like us on Facebook