‘వెంకీ’ కొత్త బ్యాక్ డ్రాప్ ఏమైందో ?

Published on Feb 21, 2020 1:04 am IST

‘ఎఫ్ 2’ ‘వెంకీ మామ’ సినిమాలతో హి ఈజ్ బ్యాక్ అనిపించుకున్న విక్టరీ వెంకటేష్ జాగ్రత్తగా సినిమాల్ని ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం ‘నారప్ప’ సినిమా చేస్తున్న ఈ సీనియర్ హీరో, యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ తో కూడా ఆ మధ్య ఓ ప్రాజెక్ట్ చేయాలనుకున్నారు. నారప్ప సినిమా తరువాత తరుణ్ భాస్కర్ సినిమా సమ్మర్ నుండి మొదలవుతుందని కూడా ఆ మధ్య వార్తలు వచ్చాయి. ఈ సినిమా హార్స్ రెసింగ్ నెపథ్యంలో సాగుతుందిని, చాలా వరకు సినిమాను మలక్ పేట్ రేస్ క్లబ్బులో చిత్రీకరిస్తారని కూడా వార్తలు వచ్చాయి.

కానీ ఆ తరువాత నుంచి ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి అప్ డేట్ లేదు, ‘వెంకీ’ నుండి కొత్త బ్యాక్ డ్రాప్ లో వస్తోన్న ఈ సినిమా ఇంతకీ ఉందా లేదా అని వెంకీ ఫ్యాన్స్ ఆరా తీస్తున్నారు. మరి ఈ సినిమా గురించి క్లారిటీ రావాలంటే ఆఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చే వరకు ఆగాల్సిందే. ఇకపోతే ఈ చిత్రాన్ని వెంకీ హోమ్ బ్యానర్ సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించనున్నారట.

ఇక ప్రస్తుతం వెంకటేష్‌ ‘నారప్ప’ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. పీటర్ హెయిన్స్ నేతృత్వంలో ‘నారప్ప’ కి సంబంధించి కీలక యాక్షన్ సన్నివేశాలను ప్రస్తుతం షూట్ చేస్తున్నారు. సురేష్‌ ప్రొడక్షన్స్‌ ప్రై.లి, వి క్రియేషన్స్‌ పతాకాలపై డి.సురేష్‌బాబు, కలైపులి ఎస్‌. థాను సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More