‘ఎన్టీఆర్’తో యువ దర్శకుడు ?

‘ఎన్టీఆర్’తో యువ దర్శకుడు ?

Published on Jun 24, 2018 2:33 PM IST

“పెళ్లిచూపులు”అనే చిన్న చిత్రంతో ఘన విజయం సాధించిన యువ ద‌ర్శ‌కుడు త‌రుణ్‌భాస్క‌ర్ ‘ఈ నగరానికి ఏమైంది ?’ అనే మరో చిన్న చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం తరువాత ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ లోనే తరుణ్ భాస్కర్ వరుసగా సినిమాలు చేయనున్నాడు. కాగా తరుణ్ నిన్న ఎన్టీఆర్ ని కలిసి తన సినిమా ప్రీమియర్ షోకి రావాల్సిందిగా కోరాడు. అయితే ‘ఈ నగరానికి ఏమైంది ?’తర్వాత తరుణ్ ఎన్టీఆర్ తోనే తన తర్వాత చిత్రాన్ని చేయనున్నాడని తెలుస్తోంది.

స్వర్గీయ రామానాయుడుగారు ఎన్టీఆర్ తో రాముడు – భీముడు చిత్రాన్ని రీమేక్ చేయాలనుకున్నారు. ఎన్టీఆర్ కూడా సినిమా చేస్తానని మాట ఇచ్చారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ చిత్రం పట్టాలెక్కలేదు. అయితే సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ కు జూ ఎన్టీఆర్ ఒక సినిమా చేయాల్సిన ఒప్పందం ఉంది. అదే విధంగా తరుణ్ భాస్కర్ తన తదుపరి చిత్రాలను కూడా సురేష్ ప్రొడక్షన్స్ లో చేస్తానని ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆ కారణంగా ఎన్టీఆర్ కు తరుణ్ కథ చెప్పనున్నారట. మరి ఈ లోపు ‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రం విడుదలై విజయం సాధిస్తే, అప్పటికి తరుణ్ కథ ఎన్టీఆర్ కి నచ్చితే ఊహించనివిధంగా ఈ కాంబినేషన్లో ఓ చిత్రం వచ్చే అవకాశం ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు