మొదటిరోజు జనాల్ని చూసి కన్నీళ్ళొచ్చాయన్న యంగ్ హీరో !
Published on Nov 18, 2016 6:59 pm IST

nikhil-i

ప్రధాని మోదీ కరెన్సీ బ్యాన్ చేసిన వేళ తెలుగుతో పాటు అన్ని బాషల పరిశ్రమల్లోనూ కొత్త సినిమాలు రిలీజవదానికి భయపడుతూ వెనక్కు తగ్గుతుంటే యంగ్ హీరో నిఖిల్ మాత్రం తనకు కీలకమైన చిత్రం ‘ఎక్కడికిపోతావు చిన్నవాడా’ ను ధైర్యంగా విడుదల చేశాడు. విఐ ఆనంద్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈరోజే ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి స్పందనను తెచ్చుకుంది. ప్రయోగాలు చేస్తూ మధ్యలో ఎందుకో మళ్ళీ రొటీన్ సినిమా ‘శంకరాభరణం’ చేసి ప్రేక్షకులను నిరుత్సాహపరిచిన నిఖిల్ ఈ సినిమాతో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని కష్టపడ్డాడు. అతను అనుకున్నట్టే ప్రేక్షకులు, విమర్శకులు సినిమాని మెచ్చుకుంటున్నారు.

దీంతో నిఖిల్ ఆనందంతో ట్విట్టర్ ద్వారా ప్రేక్షకులకు అభినందనలు తెలుపుతూ ‘సినిమాకి వచ్చిన ప్రేక్షకులను చూస్తుంటే ఆనందంతో కళ్ళలో నీళ్లొస్తున్నాయి. కరెన్సీకి ఇబ్బందిగా ఉన్న కష్టమైన పరిస్థితుల్లో కూడా జనాలు థియేటర్లకు వచ్చి సినిమా చూస్తున్నారు. చాలా ఎమోషనల్ గా ఉంది’ అంటూ ట్వీట్ చేశాడు. కెరీర్ డౌన్ ఫాల్లో ఉండగా ప్రయోగాత్మక సినిమాలను ఎంచుకున్న నిఖిల్ ఆ దారిలో వరుస సక్సెస్లను సాధిస్తూ దూసుకుపోవడం విశేషం.

 
Like us on Facebook