తెలుగులో మరో సరికొత్త సబ్జెక్ట్ తో వస్తున్న ప్రశాంత్ వర్మ.!

Published on May 29, 2021 10:00 am IST

“అ!”, లేటెస్ట్ గా “జాంబీ రెడ్డి” లాంటి సినిమాలతో మన టాలీవుడ్ లో సరికొత్త ఎక్స్ పీరియన్స్ ను సరికొత్త సబ్జెక్టును అందించిన యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ నుంచి ఈసారి ఎలాంటి ప్రాజెక్ట్ వస్తుందా అని మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయంలో నిన్ననే లేటెస్ట్ అప్డేట్ ఇచ్చారు. ఈరోజు ఈ యంగ్ ఫిల్మ్ మేకర్ పుట్టినరోజు సందర్భంగా ప్రకటిస్తామని తెలిపారు.

మరి ఎట్టకేలకు ప్రశాంత్ వర్మ సరికొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ అయ్యింది. జాంబీ రెడ్డి సినిమాతో ఒక్క తెలుగులోనే కాకుండా మన ఇండియన్ సినిమాలోనే మొట్ట మొదటి జాంబీ జానర్ లో సినిమా తీసిన ప్రశాంత్ వర్మ ఈసారి మన తెలుగులో అసలు టచ్ చెయ్యని సబ్జెక్టును అలాగే ఇండియన్ సినిమాలో చాలా రేర్ గా చేసిన కొత్త సబ్జెక్టు తో వస్తున్నాడు. అదే “హను – మాన్”.

మనకి తెలిసినంత వరకు పురాణాల్లో అత్యంత శక్తివంతమైన సూపర్ హీరో హనుమంతుడే మరి ఆ హనుమంతునికి రిలేటెడ్ గా ఈ చిత్రాన్ని ప్లాన్ చేసినట్టు అనిపిస్తుంది. బహుశా హనుమాన్ అంశతో సూపర్ హీరోగా మారిన వ్యక్తి కథో ఏమో కానీ దానిపై విడుదల చేసిన టైటిల్ అనౌన్సమెంట్ వీడియో లో విజువల్స్ చూస్తే అవుతుంది. మరి సరికొత్తగా స్టార్ట్ చేసిన ఈ సినిమాటిక్ యూనివర్స్ నుంచి ఎలాంటి సినిమాలు రానున్నాయో చూడాలి.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :