ఆ డైరెక్టర్ కుమారుడికి హీరోయిన్ దొరికింది !

ఆ డైరెక్టర్ కుమారుడికి హీరోయిన్ దొరికింది !

Published on Nov 26, 2018 4:02 PM IST

Akash poori1

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తన కుమారుడు ఆకాష్ పూరిని హీరోగా పరిచయం చేస్తూ.. మెహబూబా చిత్రం తీశారు. ఆ చిత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోయినప్పటికీ, పూరి మాత్రం తన కుమారుడిని హీరోగా బాగానే ప్రమోట్ చేశాడు.

కాగా తాజాగా పూరి జగన్నాధ్ నిర్మాణంలో ఆకాష్ పూరి హీరోగా నూతన దర్శకుడు అనిల్ దర్శకత్వంలో ఆకాష్ తన రెండో సినిమా చెయ్యబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఆకాష్ పూరి సరసన ‘గాయత్రీ భరద్వాజ్’ అనే ఓ కొత్త అమ్మాయిని హీరోయిన్ గా ఫైనల్ చేసింది చిత్రబృందం.

ఇక ఈ సినిమా మాఫియా నేపథ్యంలో ఓ ప్రేమ కథగా తెరకెక్కనుంది. మరి ఈ సినిమాతోనైనా ఆకాష్ పూరికి హిట్ వస్తోందేమో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు