అంచనాలు పెంచేలా తెరకెక్కతున్న యంగ్ హీరో చిత్రం !

అంచనాలు పెంచేలా తెరకెక్కతున్న యంగ్ హీరో చిత్రం !

Published on Jul 8, 2018 5:08 PM IST

Naga Shaurya1

నూతన దర్శకుడు శ్రీనివాస్ చక్రవర్తి దర్శకత్వంలో నాగశౌర్య తన సొంత బ్యానర్ ఐరా క్రియేషన్స్ పై ‘నర్తనశాల’ అనే చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. కాగా తాజాగా చిత్రబృందం ప్రెస్ మీట్‌లో పాల్గొంది. దర్శకుడు శ్రీనివాస్ మాట్లాడుతూ అవుట్‌ పుట్ బాగా వస్తుందని ఇప్పటికే టాకీ పార్ట్ పూర్తయ్యిందని చెప్పారు. ఈ సందర్భంగా హీరో నాగశౌర్య మాట్లాడుతూ ‘ఛలో చిత్రం తర్వాత నేను మా బ్యానర్‌ లో చేస్తున్న చిత్రం ఇదే. ఈ సినిమాలో క్యారెక్టైరెజేషన్స్ బాగుంటాయి. సాగర్ మహతి చాలా చక్కటి పాటలు అందించారని పేర్కొన్నారు.

ఇక టైటిల్‌ సాంగ్‌ను అన్నపూర్ణ స్టూడియోలో గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం ప్రధానంగా లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్ తో అంచనాలు పెంచేలా రూపొందుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ చిత్రాన్ని ఆగష్టులో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు.

తాజా వార్తలు