వైవిధ్యమైన టైటిల్ తో వస్తోన్న యువహీరో !

వైవిధ్యమైన పాత్రలు ఎంచుకోవడంలో నారా రోహిత్ ఎప్పుడు ముందు ఉంటాడు. తాజాగా ఈ హీరో మరో ప్రయోగాత్మక పాత్రలో కనిపించబోతున్నారు. నారా రోహిత్ కథానాయకుడిగా శ్రీ వైష్ణవి క్రియేషన్స్ పతాకంపై రూపొందుతున్న సినిమాకు పి.బి. మంజునాథ్ దర్శకత్వం వహించనున్నారు. అట్లూరి నారాయణరావు నిర్మించనున్నారు. ఈ సినిమాలో సినిమా ఆరంభం నుండి అంతం వరుకు మూగవాడి పాత్రలో ఈ హీరో కనిపించబోతున్నాడు.

ఉగాది సందర్భంగా ఈరోజు అమరావతిలో ఈ సినిమా లాంచనంగా ప్రారంభం అయ్యింది. శబ్దం అనే విభిన్నమైన టైటిల్ ఈ సినిమాకు ఖరారు చెయ్యడం జరిగింది. వంశీరాజేష్ ఈ చిత్రానికి కథ, మాటలు అందిస్తుండగా వికాస్ కురిమెళ్ళ సంగీతం అందిస్తున్నాడు. రిచర్డ్‌ప్రసాద్ కెమెరా మెన్ గా పనిచేస్తున్న ఈ సినిమాను సౌజన్య అట్లూరి సమర్పిస్తున్నారు.