రిపోర్టర్ పాత్రలో కనిపించబోతున్న యువ హీరో !
Published on Mar 10, 2018 1:16 pm IST

నిఖిల్ నటించిన కిరాక్ పార్టి వచ్చే శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. శరణ గోపిసేట్టి ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం కానున్నారు. ఈ మూవీ తరువాత నిఖిల్ కనితన్ రీమేక్ లో నటిస్తున్నాడు. సంతోష్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా ప్రారంభం అయ్యింది. ఈ సినిమాకు సెందిల్ కుమార్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. ఠాగూర్ మధు ఈ మూవీ కి నిర్మాత.

ఈ మూవీ లో నిఖిల్ రిపోర్టర్ పాత్రలో కనిపించబోతున్నాడని తెలుస్తోంది. నిఖిల్ ఇదివరుకు చేసిన పాత్రలకు ఈ పాత్ర భిన్నంగా ఉంటుందని సమాచారం. త్వరలో ఈ సినిమాలో నటించబోయే హీరోయిన్ ఎవరనేది ఫైనల్ చెయ్యబోతున్నారు చిత్ర యూనిట్. ఈ చిత్రంలో నటించే నటీనటుల ఇతర సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సి ఉంది.

 
Like us on Facebook