విలేజ్ బ్యాక్ డ్రాఫ్ లవ్ స్టోరిలో యువహీరో !
Published on Mar 3, 2018 5:50 pm IST

నితిన్ నటిస్తోన్న 25వ సినిమా చల్ మోహన్ రంగ. కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. రెండోసారి మేఘా ఆకాష్ నితిన్ తో నటిస్తోంది. తాజా సమాచారం మేరకు ఈ సినిమా విలేజ్ బ్యాక్ డ్రాఫ్ లో నడిచే ప్రేమకథగా తెలుస్తోంది. తాజాగా హైదారాబాద్ సారధి స్టూడియో లో వేసిన విలేజ్ సెట్ లో సినిమా చిత్రీకరించారు.

ఈ సినిమా నుండి విడుదల అయిన రెండు పాటలకు మంచి రెస్పాన్స్ లభిస్తోంది. ఏప్రిల్‌లో రిలీజ్‌కు రెడీ అవుతోన్న ఈ సినిమాను పవన్ కళ్యాణ్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌, సుధాకర్‌ రెడ్డిలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమాపై భారి అంచనాలు ఉన్నాయి. చిత్ర యూనిట్ ఈ సినిమా ప్రమోషన్స్ ను డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్నారు.

 
Like us on Facebook