తాజాగా మరో హీరో శర్వా నంద్ కి ప్రమాదం.

Published on Jun 16, 2019 10:37 am IST

టాలీవుడ్ హీరోలను గాయాలు వెంటాడుతున్నాయి. మొన్న నాగ శౌర్య కాలికి తీవ్రగాయం కాగా,నిన్న హీరో సందీప్ కిషన్ షూటింగ్ కొరకు ఏర్పాటు చేసిన బ్లాస్ట్ కారణంగా ప్రమాదానికి గురై ఆస్పత్రిపాలయ్యారు. నేడు తాజాగా మరో యంగ్ హీరో శర్వానంద్ కూడా షూటింగ్ లో గాయాలపాలైనారని సమాచారం. `96` షూటింగ్‌లో భాగంగా శ‌ర్వానంద్ థాయ్‌లాండ్‌లో స్కై డైవింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ట్రైన‌ర్స్ ఆధ్వ‌ర్యంలో శ‌ర్వా రెండు రోజులు ప్రాక్టీస్ చేసిన ఆయన మూడో రోజు ప్రాక్టీస్‌లో నాలుగు సార్లు సేఫ్‌గా ల్యాండ్ అయ్యారట. ఐతే ఐదోసారి ప్రాక్టీస్ చేస్తున్న స‌మ‌యంలో గాలి ఎక్కువ‌గా రావ‌డంతో ల్యాండింగ్ సరిగా జరగకపోవడంతో ఆయన భుజానికి తీవ్ర గాయం కాగా, కాలు కూడా స్వ‌ల్పంగా ఫ్రాక్చ‌ర్ అయ్యింది.

దీనితో శ‌ర్వానంద్ షూటింగ్ అర్దాంతరంగా ఆపేసి హైద‌రాబాద్ చేరుకొని, ఎయిర్‌పోర్ట్ నుండి నేరుగా వెళ్లి సన్ షైన్ హాస్పిట‌ల్‌లో జాయిన్ అయ్యారు. శ‌ర్వాను ప‌రీక్షించిన డాక్ట‌ర్లు భుజానికి బ‌ల‌మైన గాయం త‌గ‌లింద‌ని, కాబ‌ట్టి శస్త్ర చికిత్స అవ‌స‌రమ‌ని సూచించారు. సోమ‌వారం ఈ శ‌స్ర‌చికిత్స జ‌రగ‌నుంది. స‌ర్జ‌రీ త‌ర్వాత క‌నీసం నాలుగు రోజులు హాస్పిట‌ల్‌లోనే ఉండాల‌ని డాక్ట‌ర్స్ శ‌ర్వాకు సూచించారు.

సంబంధిత సమాచారం :

X
More