‘జాదూగాడు’గా అదరగొడుతున్న యంగ్‌హీరో!

‘జాదూగాడు’గా అదరగొడుతున్న యంగ్‌హీరో!

Published on Apr 22, 2015 4:00 PM IST

jadugadu
‘ఊహలు గుసగుసలాడే’, ‘దిక్కులు చూడకు రామయ్య’, ‘లక్ష్మి రావే మా ఇంటికి..’, చిత్రాల ద్వారా లవర్ బాయ్‌లా, మన పక్కింటి కుర్రాడిలా కనిపించి మంచి పేరు సంపాదించుకున్నాడు యువహీరో నాగశౌర్య. తాజాగా నాగశౌర్య ‘జాదూగాడు’ పేరుతో ఓ మాస్ ఎంటర్‌టైనర్ ద్వారా మన ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే విడుదలకు సిద్ధమౌతోంది.

ఇక తాజాగా ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ వేడుక నిన్న జరిగింది. ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ కుమారుడు సాగర్ మహతి సంగీత దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఆడియోకు మంచి రెస్పాన్స్ వస్తోంది. పాటలన్నీ ఒకప్పటి మణిశర్మ హిట్ సినిమా పాటల స్థాయిలో ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది. ఇక ఈ ఆడియో వేడుకలో విడుదల చేసిన ట్రైలర్ అందరినీ విపరీతంగా ఆకట్టుకుంటుంది.

ఇప్పటివరకూ కేవలం సాఫ్ట్ క్యారెక్టర్‌లకే పరిమితమైన నాగశౌర్య ఈ సినిమాలో ఆంగ్రీ యంగ‌మాన్ అలరించనున్నాడన్న విషయం ట్రైలర్ ద్వారా ఇట్టే తెలిసిపోతుంది. డైలాగ్ డెలివరీలో నాగశౌర్య చూపించిన స్టైల్ విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఫస్ట్‌లుక్ ద్వారా సినిమాపై కొన్ని అంచనాలు ఏర్పడగా తాజాగా విడుదలైన ట్రైలర్‌తో ఆ అంచనాలు తారాస్థాయికి చేరాయ్! ‘చింతకాయల రవి’ ఫేం యోగేశ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సోనారిక బదోరియా కథానాయికగా నటించింది. సత్య ఎంటర్‌టైన్‌మెట్స్ పతాకంపై వి.వి.ఎన్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు.

తాజా వార్తలు