ఫిల్మ్ ఫేర్ అవార్డుని వేలం వేస్తానంటున్న యువ హీరో !

ఫిల్మ్ ఫేర్ అవార్డుని వేలం వేస్తానంటున్న యువ హీరో !

Published on Jun 18, 2018 7:15 PM IST

అర్జున్ రెడ్డి సినిమాతో మంచి గుర్తింపును తెచ్చుకున్న హీరో విజయ్ దేవరకొండ . హైద్రాబాద్లో జరిగిన 65వ సౌత్ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ వేడుకలో అర్జున్ రెడ్డి చిత్రంలో ఉత్తమ నటనకు గాను బెస్ట్ యాక్టర్ అవార్డుని అందుకున్నాడు విజయ్ దేవరకొండ. ఈసందర్బంగా తనకు వచ్చిన ఈ మొదటి ఫిల్మ్ ఫేర్ అవార్డుని వేలంవేస్తానని దాంట్లో వచ్చిన డబ్బు ని ముఖ్యమంత్రి సహాయనిధి కి విరాళం ఇస్తానని ట్విట్టర్ ద్వారా ప్రకటించారు .

ప్రతి రోజు ట్విట్టర్లో ఎన్నోవినతులకు కేటిఆర్ అన్న ముఖ్య మంత్రి సహాయనిధి ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు. నేను కూడా ఈ అవార్డు ని వేలం వేసి వచ్చిన డబ్బుని ముఖ్యమంత్రి సహాయనిధి కి ఇస్తానని ట్విట్టర్లో పోస్ట్ చేశారు . ఇక అవార్డు రావడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన విజయ్ నటుడిగా ఉండడమే గొప్ప విజయమని ఈ అవార్డులు నాకు బోనస్ అని అన్నారు .

సంబంధిత సమాచారం

తాజా వార్తలు